పోర్నోగ్రఫీ కేసు.. రాజ్‌కుంద్రాకు బెయిల్ నిరాకరణ

ABN , First Publish Date - 2021-07-28T22:58:35+05:30 IST

అశ్లీల వీడియోల చిత్రీకరణ (పోర్నోగ్రఫీ) కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా, ఆయన..

పోర్నోగ్రఫీ కేసు.. రాజ్‌కుంద్రాకు బెయిల్ నిరాకరణ

ముంబై: అశ్లీల వీడియోల చిత్రీకరణ (పోర్నోగ్రఫీ) కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా, ఆయన సహచరుడు ర్యాన్ థోర్పేలకు కోర్టులో చుక్కెదురైంది. ఈ ఇద్దరి బెయిల్ అభ్యర్థనను ముంబై కోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. కుంద్రాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోర్నోగ్రఫీ ఫిల్మ్‌లు తీస్తూ, యాప్‌ల ద్వారా వాటిని పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలపై ఈనెల 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు.


పోర్న్ చిత్రాల నిర్మించడం, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ.1.17 కోట్లు ఆర్జించారని మెజిస్ట్రేట్ కోర్టులో క్రైం బ్రాంచ్ పోలీసులు తమ వాదన వినిపించారు. ఈ కేసులో ఇంతవరకూ 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 420, 292, 293 కింద, ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లు, మహిళలను అశ్లీలంగా చూపించారన్న చట్టం కింద కుంద్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-07-28T22:58:35+05:30 IST