Jul 6 2021 @ 10:55AM

రైజా విల్సన్‌ అందాల ఆరబోత

ఇటీవలి కాలంలో కోలీవుడ్‌కు చెందిన పలువురు భామలు అందాల ఆరబోతకు పోటీపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. ఇందుకోసం ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహించి, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ తాము లైమ్‌లైట్‌లో ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు. సినిమాల్లోనే కాకుండా ప్రత్యేక ఫొటోషూట్‌లలో కూడా వారు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిలో రైజా విల్సన్‌ ఒకరు. గత కొంతకాలంగా మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన భామల్లో ఈమె ఒకరు. ముఖానికి ప్రత్యేకంగా చేయించుకున్న చర్మ చికిత్స వికటించింది. దీంతో ఆమె మీడియాకెక్కింది. తనకు చర్మ చికిత్స చేసిన వైద్యురాలిపై కోర్టులో కేసు వేసింది. దీనికి ప్రతిగా ఆ వైద్యురాలు కూడా ఆమెపై కేసు పెట్టారు. దీంతో ఈ కేసుల వ్యవహారం గొడవ సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్వేతవర్ణం దుస్తుల్లో గ్లామర్‌ను ఎక్స్‌పోజ్‌ చేస్తూ తీసిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. సముద్రపు ఒడ్డున నిలబడి ఈ ఫొటోషూట్‌ చేశారు. రైజా విల్సన్‌ ఉన్నట్టుండి ఇలా స్పెషల్‌ ఫొటోషూట్‌ చేయడానికి కారణం మాత్రం తెలియలేదు. కానీ, ఈ దుస్తుల్లో రైజా విల్సన్‌ మాత్రం యూత్‌ను ఆకట్టుకుంటోంది. 
Otherwoodsమరిన్ని...