ఫ్రెష్‌ లుక్‌

ABN , First Publish Date - 2020-10-14T05:15:15+05:30 IST

అందంగా ర్యాంపులపై హొయలొలికించిన రైజా విల్సన్‌... ఆపై వెండితెరపై మెరిసింది. తమిళంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వచ్చిన ‘బిగ్‌ బాస్‌’ ద్వారా బాగా పాపులర్‌ అయింది.

ఫ్రెష్‌ లుక్‌

అందంగా ర్యాంపులపై హొయలొలికించిన రైజా విల్సన్‌... ఆపై వెండితెరపై మెరిసింది. తమిళంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వచ్చిన ‘బిగ్‌ బాస్‌’ ద్వారా బాగా పాపులర్‌ అయింది. ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’ చిత్రంలో నటనకు ‘బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూ’గా ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న రైజా... వెరైటీ డ్రెస్‌లతో అలరిస్తుంటుంది. షూటింగ్‌లు పెద్దగా లేకపోయినా... తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటోంది. అనూషా డిజైన్‌ చేసిన సింగిల్‌ పీస్‌ అవుట్‌ఫిట్‌లో... స్విమ్మింగ్‌పూల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తాజాగా ఇలా పోజిచ్చిందీ బ్యూటీ. హెయిర్‌ డ్రెస్సింగ్‌... అశ్వని. ఫొటోగ్రఫీ విగ్నేష్‌కుమార్‌.

Updated Date - 2020-10-14T05:15:15+05:30 IST