రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాస్తారోకో

ABN , First Publish Date - 2020-12-05T03:56:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాస్తారోకో
బెల్లంపల్లిలో రాస్తారోకో చేస్తున్న టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు

బెల్లంపల్లి టౌన్‌, డిసెంబరు  4: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎస్‌ఐ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ జీఎం కార్యాలయ చౌరస్తా, మేయి న్‌ బజార్‌ మీదుగా సీఐటీయూ కార్యాలయానికి చేరు కొని కాంటా చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవసాయ బిల్లును ప్రవే శ పెట్టడం దేశంలోని రైతాంగానికి నష్టం చేకూర్చిందని,  ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశా రు. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమా రి మాట్లాడుతూ హర్యానా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది మం ది ఢిల్లీకి చేరుకొని నిరసన తెలుపుతున్నారన్నారు.  యువకుల నుంచి మొదలు  వృద్ధుల వరకు చట్టాల ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొ ట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇనుప కంచెలు, బారీ గేడ్‌లు, భాష్పవాయు ప్రయోగించి అణచివేతకు పాల్ప డుతోందన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించు కున్న కార్మికులకు సంబంధించిన  40 చట్టాలను  రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం అమానుషమ న్నారు. గుండారపు చక్రపాణి, కవిత, రమేష్‌, సంరక్ష, రాగరాజు, శివానంద్‌, సంపత్‌, భరత్‌,   పాల్గొన్నారు.  

ఏసీసీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవేణు అన్నారు. మంచిర్యాలలో శుక్రవారం ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాల వల్ల నిత్యావసర ధరలు అదుపులో ఉండవని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలతో రైతులు ఒప్పందం చేసుకోవడం వల్ల వారి కి స్వేచ్ఛ ఉండదని, ఈ చట్టాల వల్ల కార్పొరేట్‌ సంస్థల కు మేలు కలుగుతుందే తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరగదన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ఉపా ధ్యక్షురాలు ఎస్‌.లావణ్య, జిల్లా కోశాధికారి ఆర్‌. దిలీప్‌, కార్యదర్శులు నర్సయ్య, జైపాల్‌, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌రావు, పోశెట్టి, బారిక్‌, వాహిద్‌ పాల్గొన్నారు. 

నెన్నెల: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాలుకుమార్‌ డి మాండ్‌ చేశారు. నెన్నెలలో విలేకరులతో మాట్లాడారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన లు చేస్తుంటే వారిపై కేంద్ర ప్రభుత్వం దాడులకు దిగుతోందన్నారు.

 వ్యవసాయ భూములను బహుళ జాతి కంపెనీలకు తాకట్టు పెడుతూ వ్యవసాయ రం గాన్ని సంక్షోభంలోకి నెడుతుందన్నారు. కేంద్రం ఇప్ప టికైన స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిన అంశా లను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్ష ణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవ సాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాల ను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి, జిల్లా నాయకులు కంబాల లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:56:01+05:30 IST