రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ

ABN , First Publish Date - 2020-12-05T03:54:18+05:30 IST

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి వారి ఖాతాలలో నగదును జమ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.96 లక్షల నగ దును వారి అకౌంట్లలో జమ అయ్యిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంక టేశ్వర్లు పేర్కొన్నారు.

రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ
ఆన్‌లైన్‌లో జమ అయిన రశీదును రైతుకు అందజేస్తున్న డీసీఎస్‌ఓ

2,504 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

రూ.96 లక్షల చెల్లింపులు ఫ డీసీఎస్‌వో వెంకటేశ్వర్లు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 4: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి వారి ఖాతాలలో నగదును జమ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.96 లక్షల నగ దును వారి అకౌంట్లలో జమ అయ్యిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంక టేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటలలోపు వారి ఖాతాలలో డబ్బులు జమ చేశామని, కౌలు రైతులు అప్రూవల్‌ విషయంలో ఎ లాంటి ఆలస్యం జరగకుండా సిబ్బందిని కేటాయించాలన్నారు. కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు ఆలస్యం చేయకుండా ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని, ఆలస్యం చేస్తే రైతులకు నగదు జమ పెండింగ్‌లో ఉంటుందని, నిర్వాహకులు, అధికారు లు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 420 మంది రైతుల వద్ద నుంచి 2504 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించామన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన రైతులకు శుక్రవారం వరకు రూ.96 లక్షల నగదును వారి అకౌంట్లలో జమచేశామన్నారు. అనంతరం రైతుల అకౌంట్లలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు జమ అయినట్లు రశీదును రైతులకు అందజేశారు.  జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ గెడెం గోపాల్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డీటీలు విజయ, కొండ య్య, డీపీఏ అన్వేష్‌, డీఆర్‌పీ రామస్వామి, రాజశేఖర్‌, గంగాధర్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:54:18+05:30 IST