ఆర్‌బీకేలో ధాన్యం కొనుగోళ్లని పరిశీలిస్తోన్న పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ప్రగతి
పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ప్రగతి
గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల వద్ద నుంచి ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా అనుసంధానించిన రైసుమిల్లులకు తరలించాలని పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ కేబీఎస్ ప్రగతి సూచించారు. శనివారం ఆమె జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులతో కలిసి పలు ఆర్‌బీకేలను సందర్శించారు. చుండూరులోని పెదగాదెలపర్రు గ్రామంలో పర్యటించిన ఆమె రైతులతో ముఖాముఖీగా మాట్లాడారు. రైతులెవ్వరూ అపోహలకు గురి కావొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులున్నాయని, 21 రోజుల్లో కచ్ఛితంగా రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టీ శివరాంప్రసాద్ పాల్గొన్నారు.