రైతు సుభిక్షంగా, ఆనందంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-17T06:55:45+05:30 IST

రంగంపేట, మే 16: రైతు సుభిక్షంగా, ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి బలంగా నమ్ముతారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. రంగంపేట మండలం సింగంపల్లి సొసైటీ ఆవరణలో సోమవారం జిల్లా స్థాయిలో రైతు భరోసా మొదటి విడ

రైతు సుభిక్షంగా, ఆనందంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి
సింగంపల్లిలో రైతు భరోసా చెక్కును రైతులకు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ మాధవీలత, ఎమ్మెల్యే సత్తి

జిల్లా కలెక్టర్‌ మాధవీలత

సింగంపల్లి సొసైటీ వద్ద రైతు భరోసా తొలి విడత జమ

మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఈసారి ఖరీఫ్‌లో ముందస్తుగానూ కాల్వలకు నీరు

రంగంపేట, మే 16: రైతు సుభిక్షంగా, ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి బలంగా నమ్ముతారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. రంగంపేట మండలం సింగంపల్లి సొసైటీ ఆవరణలో సోమవారం జిల్లా స్థాయిలో రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా మొదటి విడతగా 121955 మంది రైతులకు రూ.67.07కోట్లు జమ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జీవించడానికి అన్నాన్ని అందించే రైతు సుభిక్షంగా ఉండాలన్న దే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రబీ సీజన్లో పెట్టుబడి కింద వినియోగించుకునేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు ముందస్తుగా కాలువలకు నీరందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులకు ఏకష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటానని కలెక్టర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముందస్తుగా సాగునీరు అందించేందుకు ఈనెల 18న జలవనరుల శాఖ సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అన్నారు. సీఎం పాదయాత్రలో రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని ఇప్పు డు అదనంగా రూ.వెయ్యి పెంచి ఇస్తున్నారన్నారు. జలకళ పథకంలో అనపర్తి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో ఇప్పటికే కొంతమందికి బోర్లు వేయించామని, మిగిలిన వారికి త్వరలో వేయిస్తామన్నారు. రైతు భరోసా కింద అనపర్తి నియోజకవర్గంలో 18604 మంది రైతులకు రూ. 10.23 కోట్లు, గోపాలపురం నియోజకవర్గంలో 24,255 మందికి రూ.13.34 కోట్లు, గోకవరం మండలంలో 8350 మందికి రూ. 4.59 కోట్లు, కొవ్వూరు నియోజకవర్గంలో 15984 మందికి రూ. 8.79 కోట్లు, నిడదవోలు నియోజకవర్గంలోని 27,652 మందికి రూ.15.21 కోట్లు రైతు భరోసా సాయం విడుదల చేశామన్నారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్‌ అక్కడ ఏర్పాటుచేసిన వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు సత్తి గీతావరలక్ష్మి, రొంగల పద్మావతి, పేపకాయల రాంబాబు, పేపకాయల వెంకట లక్ష్మి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు లంక చంద్రన్న, ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎం.గోవిందరాజు, వైసీపీ మండల కన్వీనర్‌ నల్లా శ్రీనివాసరావు, ఎంపీపీలు కేతా తులసి, అంసూరి సూర్యనారాయణ, రిమ్మలపూడి శ్రీదేవి, పీఏసీఎస్‌ అధ్యక్షులు బుల్లి వీర్రాజుచౌదరి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌. మాధవరావు, జిల్లా మత్య్స ఉద్యానవన, పశుసంవర్ధక శాఖాధికారులు కృష్ణారావు, రాధాకృష్ణ, సత్యగోవిందం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:55:45+05:30 IST