ముంపు సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-27T05:44:22+05:30 IST

భారీ వర్షాల వల్ల రైతులు వేసిన సార్వా నారుమడులన్నీ నీట మునిగి దెబ్బ తిన్నాయని, రెండోసారి వేసినవి న ష్టపోయినందున ప్రభుత్వం ఆదుకో వాలని రైతు కార్యాచరణ సమితి డి మాండ్‌ చేసింది.

ముంపు సమస్యలు పరిష్కరించాలి
విలేకరులతో మాట్లాడుతున్న గోపాలకృష్ణంరాజు, కమలాకరశర్మ

రైతు కార్యాచరణ సమితి నాయకుల డిమాండ్‌ 

భీమవరం, జూలై 26 : భారీ వర్షాల వల్ల రైతులు వేసిన సార్వా నారుమడులన్నీ నీట మునిగి దెబ్బ తిన్నాయని, రెండోసారి వేసినవి న ష్టపోయినందున ప్రభుత్వం ఆదుకో వాలని రైతు కార్యాచరణ సమితి డి మాండ్‌ చేసింది. ప్రస్తుతం నీటి సంఘాలు లేకపోవడం వల్ల డ్రెయి నేజీలపై పర్యవేక్షణ లోపించిందని సమితి అధ్యక్షుడు కలిదిండి గోపా లకృష్ణంరాజు, అధికారి ప్రతినిధి కె.కమలాకరశర్మ ఆరోపిం చారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ పదేళ్ల కిందటి వరకు జిల్లా డ్రెయినేజీ బోర్డు ఉండేదని, దీని వల్ల ప్రతి ఏటా ముంపు సమస్యలపై కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించేవారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. డ్రెయినేజీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక ము రుగు కాల్వలు ఆక్రమణలతో పూడుకుపోవడంతో ముంపు సమస్య ఏర్పడిందన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలన్నారు. రైతుల ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి జిల్లా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమితి సహాయ కార్యదర్శి కృష్ణంరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:44:22+05:30 IST