Abn logo
Sep 21 2021 @ 23:25PM

విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణం

సమావేశంలో ప్రసంగిస్తున్న పోతుగుంట రమే్‌షనాయుడు

రాజంపేట, సెప్టెంబరు21 : కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యుత్‌చార్జీలు పెంచడం దారుణమని  వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని రాజంపేట బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు హెచ్చరించారు. మంగళవారం రాజంపేటలో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీల పేరుతో సామాన్యుడి నడ్డి విరచడం దారుణమన్నారు.  రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, నవరత్నాల పేరిట ఉచిత పథకాలు అమలుపరుస్తూ దొడ్డిదారిన చార్జీలు పెంచడం తగదన్నారు.  ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జి.కె.నాగరాజు, ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు చేజర్ల మణి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర, ఓబీసీ మోర్చ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్‌, మైనార్టీ మోర్చ పట్టణ అధ్యక్షుడు షేక్‌ అలీ, బీజేపీ పట్టణ కార్యదర్శి పెనుగొండ రమణ పాల్గొన్నారు.