పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2022-07-03T05:04:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించాలని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలి
మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

 వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టండి  రావాలి చంద్రబాబు.. పోవాలి జగన్‌ అంటూ నిరసనలో టీడీపీ నేతల నినాదాలు

మదనపల్లె టౌన్‌, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే  ఉపసంహరించాలని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. వైసీపీ అరాచక పాలన పోవాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావా లని, ప్రజలను బాదుతున్న జగన్‌ పోవాలని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచిన నేపథ్యం లో శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద టీడీపీ నా యకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పలుమార్లు ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచారని, ఇప్పుడు సెస్సుల పేరుతో ప్రశ్నించే వారు లేరని భావించిన వైసీపీ ఇష్టారా జ్యంగా పన్నులు పెంచుతున్నారన్నారు. ప్రజల పక్షాన టీడీపీ పోరాడు తుందని, చార్జీలు తగ్గించే వరకు ఆందోళనలు ఉధృ తం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు  రామ్మోహన్‌, మండల ప్రధాన కార్య దర్శి కత్తి లక్ష్మన్న, ఎస్‌.సుధాకర్‌, రామాంజులు, రాణా, విజయ్‌కుమార్‌, ప్రభాకర్‌, వెంకరమణారెడ్డి, విద్యాసాగర్‌, వినోద్‌, మైనారిటీ నేతలు రఫి, అన్వర్‌బాషా, దాదాపీర్‌, పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో : ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీ లను నిరసిస్తూ టీడీపీ నాయకులు బి.కొత్తకోట లో ధర్నా చేశారు. శనివారం స్థానిక పీటీఎం రోడ్డులో బస్‌ స్టాప్‌ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈసందర్బంగా టీడీపీ మండల అధ్యక్షుడు నారాయ ణస్వామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ధరలను భారీగా  పెంచి సామాన్య ప్రజల ఆర్థిక పరి స్థితిని చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు.  కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ బంగారు వెంక ట్రమణ, టీడీపీ నాయకులు కుడుం శ్రీనివాసులు, అంజి, కనకంటి ప్రసాద్‌, కరీంసాబ్‌, సురేంద్ర, రియాజ్‌అలీ పాల్గొన్నారు. 

గుర్రంకొండలో: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ గుర్రంకొండలో టీడీపీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఇం దులో భాగంగా బస్టాండు వరకు ర్యాలీ చేసి నిరసన తెలి పారు. బస్సు చారీల పెంపుతో వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాయిని జగదీష్‌కుమార్‌, అహ్మద్‌, మురళీ, క్రాంతికుమార్‌, చలమారెడ్డి, ఆనం ద్‌, చంద్రబాబు, సుధాకర్‌, ఉమాశంకర్‌, ధ్వారక, సాగర్‌, ప్రకాశ్‌, మౌలా, వెంకటరమణ, రంజిత్‌, సుబ్బరాజు, తారక, శ్రీనివాసులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తూ రాష్ట్రాన్ని అత లాకుతలం చేస్తున్న బాదుడు సీఎం జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయ ని వాల్మీకిపురం టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికా ర్జునరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం వాల్మీకిపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై పార్టీ ఆధ్వర్యం లో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పేద ప్రజల సమ స్యలు పట్టని జగన్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని నివాదాలతో హోరెత్తించారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వలిగట్ల వెంకట రమణ, జిల్లా పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, నేతలు పీవీ నారాయణ,  రమేష్‌, చంద్రమౌళి, డిష్‌ బ్రదర్స్‌, పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, మురళి, ఆనం దరెడ్డి, తెలుగు యువత చాను, సయ్యద్‌ బా షా, టీస్టాల్‌ సయ్యద్‌, రహంతుల్లా, షబ్బీ రుల్లా ఖాన్‌, గోవింద్‌,  బొక్కసం రామకృష్ణ, జయ, కేకే నా యుడు, సిద్దయ్య, శ్రీనివాసులు, రెడ్డిరామ్‌,  పాల్గొన్నారు. 

నిమ్మనపల్లెలో: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలపై టీడీపీ నేతలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రేమేష్‌ ఆదేశాల మేరకు స్థానిక బస్డాండ్‌ కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర విభాగ ఎస్సీసెల్‌ అధ్య క్షుడు మునిరత్నం మాట్లాడుతూ సామాన్య ప్రజల పై మోయలేని భారం మోపారన్నారు. కార్యక్రమం లో నాయకులు మల్లిఖార్జున, మురళి, విజయ్‌, వెంకటరమణ, చెన్నరాయుడు, లక్ష్మన్న, అన్వర్‌భాషా, సూర్యప్రకాశ్‌, రామచంద్ర, చంద్ర పాల్గొన్నారు. 

పెద్దమండ్యంలో: ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని మండల టీడీపీ కన్వీనర్‌ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. పెద్ద మండ్యంలో శనివారం మండల టీడీపీ కన్వీనర్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశా రు. రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు నటరాజ్‌ నాయక్‌, నేతలు  శ్రీనివాసులు, రెడ్డి, గంగా ధర, పెద్దన్న,, సాంబ, ఓబులేసు, మహేష్‌  పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-03T05:04:56+05:30 IST