హెచ్‌ఐవీ పట్ల సామాజిక స్పృహ పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-05-17T04:53:39+05:30 IST

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ పట్ల సామాజిక స్పృహ పెంపొందించడం, సమాజంలో నెలకొన్న చిన్న చూపు, వివక్ష తొలగించడమే ధ్వేయంగా పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

హెచ్‌ఐవీ పట్ల సామాజిక స్పృహ పెంపొందించాలి
కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న డీఎంఅండ్‌హెచ్‌వో, సిబ్బంది

డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌


కడప(కలెక్టరేట్‌), మే 16: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ పట్ల సామాజిక స్పృహ పెంపొందించడం, సమాజంలో నెలకొన్న చిన్న చూపు, వివక్ష తొలగించడమే ధ్వేయంగా పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ సంస్మరణ దినోత్సవ కార్యక్రమం డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా వైద్య సిబ్బంది కొవిడ్‌ నిబంఽ దనలు పాటిస్తూ మౌనంగా కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ హెచ్‌ఐవీతో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. హెచ్‌ఐవి వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగదన్నారు. అలాంటి సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. 2021లో ఎంపిక చేసిన థీమ్‌ మనం హెచ్‌ఐవిని అధిగమిద్దాం..తగిన చర్యలు  చేపడతాం.. మనకు హెచ్‌ఐవీ నివారణ గుర్తుంది అనే అంశాల పట్ల  వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో ఖాదర్‌వలి, హెచ్‌ఈవో గుణశేఖర్‌, విహాన్‌ పాజిటివ్‌ నెట్‌వర్క్‌ సభ్యులు డాక్టర్‌ లక్ష్మీకర్‌, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, డీఏపీసీయూ డీపీఎం భాస్కర్‌, పీవీ ప్రసాద్‌, జిల్లా వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


ఫీవర్‌ సర్వేకు సహకరించండి...


ప్రొద్దుటూరు క్రైం, మే 16 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, కట్టడి దిశ చేపట్టిన ఫీవర్‌ సర్వేకు ప్రజలు సహకరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక డ్రైవర్‌కొట్టాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వలంటీర్లు, ఆశావర్కర్లు ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపట్టారు. ఈ సర్వేను డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ అకస్మిక తనిఖీ చేశారు. ఫీవర్‌ సర్వే మార్గదర్శకాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యలో భాగంగా 15వ తేదీ నుంచి ఆరవ రౌండ్‌ ఇంటింటి ఫీవర్‌ సర్వే జరుగుతోందన్నారు. సర్వే నిమిత్తం మీ ఇళ్లకు వచ్చే సిబ్బందికి మీ ఇంట్లో ఎవరైనా జ్వరాలతో బాధపడుతుంటే, వారి వివరాలను తెలియజేయాలన్నారు. జ్వరపీడితులను గుర్తించిన వెంటనే వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, వచ్చిన రిపోర్టు మేరకు మందులను ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని వల్ల కరోనా కేసులను తగ్గించవచ్చునన్నారు.  కార్యక్రమంలో కొవిడ్‌ అర్బన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరకుమార్‌, వైద్యాధికారులు శివప్రసాద్‌రెడ్డి, హనీ్‌ఫబాబా, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, డీపీఎం విష్ణు, సీవో ఎంవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-17T04:53:39+05:30 IST