చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-10-28T05:17:04+05:30 IST

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత తెలిపారు. మండలంలోని పవర్‌గ్రిడ్‌లో బుధవారం విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె చట్టాలపై అవగాహన కలిగించారు. ప్రస్తుతం జరుగుతున్న మోసాలపై ఏ విధంగా కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చునో వివరించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
అవగాహన కలిగిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత

సీకేదిన్నె, అక్టోబరు 27: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత తెలిపారు. మండలంలోని పవర్‌గ్రిడ్‌లో బుధవారం విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె చట్టాలపై అవగాహన కలిగించారు. ప్రస్తుతం జరుగుతున్న మోసాలపై ఏ విధంగా కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చునో వివరించారు. న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉంటుందని, మరీ ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సత్కరిస్తుందని, న్యాయపరంగా ఎటువంటి సమస్య ఉన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు న్యాయం పొందాలన్నారు. కార్యక్రమంలో పవర్‌గ్రిడ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆంజనేయులు, డీజీఎం కేవీఎల్‌జే చౌదరి, జనార్దన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:17:04+05:30 IST