రాజ్యాంగంపై అవగాహన పెంచాలి

ABN , First Publish Date - 2021-11-27T05:05:23+05:30 IST

భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో ఇప్పటి నుంచే రాజ్యాంగ స్ఫూర్తిపై అవగాహన పెంచాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌ సూచించారు.

రాజ్యాంగంపై అవగాహన పెంచాలి
ప్రొద్దుటూరు సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రత్నప్రసాద్‌

ప్రొద్దుటూరు క్రైం/టౌన్‌/అర్బన్‌, నవంబరు 26 : భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో ఇప్పటి నుంచే రాజ్యాంగ స్ఫూర్తిపై అవగాహన పెంచాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక వైవీఎస్‌ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ప్రిన్పిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రత్నప్రసాద్‌ ముఖ్య అతిఽథిగా హాజరై  మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రతి వర్గానికి హక్కులను నిర్దేశించిందన్నారు. కార్యక్రమంలో ీన్యాయవాదులు ముడిమెల కొండారెడ్డి, బి.ఓటులేసు, రమేష్‌, డిప్యూటీ డీఈవో నాగరాజు, పాఠశాల హెచ్‌ఎం కాశీప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి  ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీజా దస్తగిర్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ వెనుకబడిన కులాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.  కార్యక్రమం లో పార్టీ పట్టణాధ్యక్షులు రాజారెడ్డి, హుస్సేన్‌, మురళి పాల్గొన్నారు. అంబేడ్కర్‌ క ృషి అభినందనీయమని రాయలసీమ పరిరక్షణ సంఘం జిల్లా కన్వీనర్‌ ప్రపతా్‌పరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవసందర్బంగా  షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు అంబేడ్కర్‌ విగ్రహానికి దళితసంఘాల నేతలతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబయ్య సురేష్‌ బాబు ఆంజనేయులు రామచంద్రుడు వెంకట సుబ్బయ్యలు పాల్గొన్నారు. 

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 26: జమ్మలమడుగు ప్రభుత్వ శాఖ గ్రంథాలయంలో 73వ రాజ్యాం గ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జింకా చం ద్రశేఖర్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందన్నారు.  అలాగే జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు ప్రాంగణంలో  జడ్జి బాబాఫకృద్దీన్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు పొందుపరిచారన్నారు. కాగా సమత దళిత్‌ యునైటెడ్‌ కమిటీ ఆద్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సమసమాజ సమితి ఆధ్వర్యంలో డాక్టర్‌ అగస్టిన్‌,  అధ్యక్షుడు వెంకటస్వామి, బీసీ నాయకుడు అవ్వారు మల్లికార్జున, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు మేకల ఆంజనేయులు ఆధ్వర్యంలో  అంబేడ్కర్‌ విగ్రహానికి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఎర్రగుంట్లలో..

ఎర్రగుంట్ల, నవంబరు 26: భారత రాజ్యాంగ దినోత్స వాన్ని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరు పుకున్నారు. రాజ్యాంగాన్ని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1950లో జాతికి అంకితమిచ్చారని నేటికి రాజ్యాంగం వచ్చి 72సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు నాగరాజు, శ్రీరాము లు తెలిపారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రప టానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రభుకు మార్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు సహదేవుడు, మాల మహానాడుకు చెందిన సురేష్‌ బాష  పాల్గొన్నారు. 

కొండాపురంలో..

కొండాపురం, నవంబరు 26: అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వలనే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి చెందుతున్నాయని మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు తెలిపారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకు లు వెంకటరమణ, చిన్న, మహబూబ్‌ బాష, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మైలవరంలో..

మైలవరం, నవంబరు 26: రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ సేవలు మరువలేనివని మైలవ రం, వేపరాల జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయు లు పరమేశ్వరయ్య, హరిహర ప్రసాద్‌, గ్రంఽథాలయాధికారి బాలచంద్రలు పేర్కొన్నారు. శుక్రవారం వేపరాల, మైలవరంలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహిం చి విద్యార్ధులకు బహుమతులను  అందజేశారు.  కార్యక్రమంలో ఉపాద్యాయులు హరిమదుసూదన్‌రావు  పాల్గొన్నారు.

ముద్దనూరులో..

ముద్దనూరు నవంబరు26:భారత  రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏపీ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ దళిత సమాఖ్య మండల అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లె  ఎల్లయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సేవలు మరువరానివ న్నారు.   కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీయస్‌ నాయకులు శివఆంజనేయులు, వెంకట నారాయణ, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-11-27T05:05:23+05:30 IST