లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-05T07:06:13+05:30 IST

యాసంగిలో లాభదాయక పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు.

లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి
వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 4: యాసంగిలో లాభదాయక పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో పంటల సాగు విధానంపై రూపొందించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, మినుములు, ఆవాలు, పొద్దుతిరుగుడు, పెసర, బొబ్బర్లు, ఆముదాలు, ధనియాలు, నువ్వులు, కుసుమలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఏవో రామారావునాయక్‌, ఏడీఏ జగ్గునాయక్‌, ఏవోలు సునీత, కృష్ణసందీప్‌, జానిమియా, ఉషారాణి, ఆశాకుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T07:06:13+05:30 IST