ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-07T06:40:28+05:30 IST

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవ గాహన కల్పించాలనీ, భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఉండవనీ, రైతులకు క్షేత్రస్థాయిలో వివరిం చాలనీ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
సమావేశంలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 6: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవ గాహన కల్పించాలనీ, భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఉండవనీ, రైతులకు క్షేత్రస్థాయిలో వివరిం చాలనీ  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం వ్యవసాయ అధికా రులతో  సమావేశం నిర్వహించారు. యాసంగి పంట లకు సంబంధించి వ్యవసాయ శాఖ రూపొం దించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సీజన్‌లో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, మినుములు, శనగలు, పెసర్లు, నువ్వులు, ధాన్యాలు, ఆముదాలు, ఆవాలు, బబ్బెర్లు, కుసుమలు, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఏవో రణధీర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:40:28+05:30 IST