తడిచిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-13T05:49:21+05:30 IST

జిల్లాలో బుధవారం అక్కడక్కడా వర్షం కురిసింది. చాగలమర్రిలో అత్యధికంగా 115 మి.మీల వర్షం నమోదైంది.

తడిచిన ధాన్యం
చాగలమర్రి: ఎం.తండాలో వరి ధాన్యం కుప్ప వద్ద నిలిచిన నీటిని తొలగిస్తున్న రైతు

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 12: జిల్లాలో బుధవారం అక్కడక్కడా వర్షం కురిసింది. చాగలమర్రిలో అత్యధికంగా 115 మి.మీల వర్షం నమోదైంది. చాగలమర్రి, ఉయ్యాలవాడ, రుద్రవరం, పగిడ్యాల మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికందిన దిగుబడులు తడిచిపోయాయి. చాగలమర్రి మండలంలో 10 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. సంజామలలో 74.6, రుద్రవరంలో 69, దొర్నిపాడులో 61.4, గోస్పాడులో 54, కోవెలకుంట్లలో 53.4, ఆళ్లగడ్డలో 47.2, కోసిగిలో 40.2, పగిడ్యాలలో 39.8, నంద్యాలలో 39, మహానందిలో 38.4, మిడ్తూరులో 34.2, జూ.బంగ్లాలో 30.2, వెలుగోడులో 29.8, ఉయ్యాలవాడలో 29.2, పాములపాడులో 28.8, నందవరంలో 26.4, గడివేములలో 25.6, హోళగుందలో 23.4, బనగానపల్లెలో 23.2, డోన్‌లో 21.8, కృష్ణగిరిలో 20.8, పాణ్యంలో 18.4, మద్దికెరలో 18, బండి ఆత్మకూరులో 17.2, కొలిమిగుండ్లలో 12.2, శిరివెళ్లలో 12.2, కౌతాళంలో 12, చిప్పగిరిలో 10.6, ఆత్మకూరులో 10.6 మి.మీ. వర్షం నమోదైందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

Updated Date - 2021-05-13T05:49:21+05:30 IST