రోజుల తరబడి రహదారిపై నిలుస్తున్న వర్షపు నీరు

ABN , First Publish Date - 2022-08-08T06:03:11+05:30 IST

పట్టణంలో పలు వార్డులలో సైడు కాల్వలు నిర్మాణం జరగక వర్షంనీరు, ఇళ్లలోకి వస్తోంది. ఇళ్ల పక్కన రోజులు తరబడి రోడ్లపై నీరు నిల్వ ఉండి, దుర్వాసన వాసనతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.

రోజుల తరబడి రహదారిపై నిలుస్తున్న వర్షపు నీరు
వీధుల్లో నిలిచిన వర్షపునీరు

ఎర్రగొండపాలెం, ఆగస్టు 7 : పట్టణంలో పలు వార్డులలో సైడు కాల్వలు నిర్మాణం జరగక వర్షంనీరు, ఇళ్లలోకి  వస్తోంది. ఇళ్ల పక్కన రోజులు తరబడి రోడ్లపై నీరు నిల్వ ఉండి, దుర్వాసన వాసనతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.  సాయంత్రం అయిందంటే వీధుల్లో నిల్చోవాలంటే దోమలపోటుకు ఎర్రగొండపాలెం ప్రజలు అల్లాడిపోతున్నారు. వారంరోజులుగా కురుస్తున్న  కొద్దిపాటి వర్షానికే సీసీ రోడ్లపై పడిన వర్షం వీధి చివర మూలమలుపు  వద్ద రోజులు తరబడి వర్షపు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు వ్యాపిస్తున్నాయి. ఇందిరానగర్‌, మసీదు బజారులో సైడు కాల్వలు లేక మురుగునీరు రోజుల తరబడిరోడ్లపై నిల్వ ఉంటుంది. పాత సబ్‌రిజిష్టార్‌ కార్యాలయం  రోడ్డుపై వర్షం నీరు రోజుల తరబడి నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. దోమల వ్యాప్తితో కంటిమీద కునుకు ఉండడం లేదని ప్రజలు వాపోతు న్నారు. స్కూలు పిల్లలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2022-08-08T06:03:11+05:30 IST