గాలివానకు తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-27T05:10:42+05:30 IST

గాలితో కూడిన వర్షంతో మండల కేంద్రంలో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.

గాలివానకు తడిసిన ధాన్యం
ఊర్కొండ శివారులోని కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై జిన్నింగ్‌ మిల్లు వద్ద కురిసిన వర్షంతో తడిసిన వరి

ఊర్కొండ, మే 26: గాలితో కూడిన వర్షంతో మండల కేంద్రంలో మామిడి తోటల్లో  కాయలు నేలరాలాయి. వరి చేళ్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం గాలి బీభత్సంతో పాటు అకాల వర్షం కురవడంతో మండల కేంద్రంతో పాటు ఊర్కొండపేట, నర్సంపల్లి తదితర గ్రా మాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. అక్కడక్కడ వరి చేళ్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-27T05:10:42+05:30 IST