Rains: నేడు ఏపీలో వర్షాలు

ABN , First Publish Date - 2022-07-24T15:18:35+05:30 IST

ఉత్తరాదిలో నాలుగైదు రోజులుగా ఉన్న రుతుపవన ద్రోణి తూర్పు భాగం శనివారం దక్షిణాది వైపు మళ్లింది.

Rains: నేడు ఏపీలో వర్షాలు

విశాఖ: ఉత్తరాదిలో నాలుగైదు రోజులుగా ఉన్న రుతుపవన ద్రోణి తూర్పు భాగం శనివారం దక్షిణాది వైపు మళ్లింది. దీనికితోడు ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ (Odisha Chhattisgarh) పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటివల్ల రుతుపవనాలు చురుగ్గా మారడంతో శనివారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమ (Rayalaseema)లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్క డ వర్షాలు కురుస్తాయని, తర్వాత 2, 3 రోజుల్లో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు గోదావరి (Godavari) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద 41.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రానికి నాలుగడుగులు పెరిగి 45.90కు చేరుకుంది. తెలంగాణాలోని పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం క్రమంగా పెరగుతోంది. వరద బాధితులు ఇప్పుడిప్పుడే తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇంతలోనే మళ్లీ వరద పెరుగుతుందన్న సమాచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2022-07-24T15:18:35+05:30 IST