rains: ఏపీలో పలుచోట్ల వర్షాలు

ABN , First Publish Date - 2022-09-26T02:26:23+05:30 IST

కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికితోడు ఆదివారం వేసవిని

rains: ఏపీలో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం: కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికితోడు ఆదివారం వేసవిని తలపించేలా వేడి వాతావరణం నెలకొంది. వీటి ప్రభావంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ఆదివారం ఎండ తీవ్రత నెలకొనడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలు, నెల్లూరులో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2022-09-26T02:26:23+05:30 IST