తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు

ABN , First Publish Date - 2020-07-06T22:19:35+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం.. క్రమంగా వాయువ్యదిశగా పయనిస్తూ ప్రస్తుతం జార్ఖండ్, ఉత్తర ఒడిశాను అనుకుని కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ శివారులో మున్నేరువాగు, గూడూరు శివారులో పాకాలవాగు, కేసముద్రం మండలంలో వట్టివాడు, నెల్లికురుదు మండలంలో ఆకెరువాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జాల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2020-07-06T22:19:35+05:30 IST