తెలంగాణకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన

ABN , First Publish Date - 2022-05-09T17:28:04+05:30 IST

తెలంగాణలో వచ్చే మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

తెలంగాణకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విదర్భ నుంచి కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

Read more