అకాల వర్షం.. అరటికి నష్టం

ABN , First Publish Date - 2022-05-03T15:06:16+05:30 IST

ఈరోడ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరిగాయి. జిల్లాల్లో కొద్దిరోజులుగా పగటి

అకాల వర్షం.. అరటికి నష్టం

పెరంబూర్‌(చెన్నై): ఈరోడ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరిగాయి. జిల్లాల్లో కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో, ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జిల్లా అత్యధికంగా పెరుందురైలో 125 మి.మీ వర్షపాతం నమోదైంది. అమ్మాపేట, ఉమారెడ్డియూర్‌, గోపిచెట్టిపాళయం, చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more