భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: Chandrababu

ABN , First Publish Date - 2022-05-11T22:32:13+05:30 IST

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సూచించారు.

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: Chandrababu

అమరావతి: భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని ట్విట్టర్‌ (Twitter‌)లో చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా 'అసాని' బలహీనపడింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కిలోమీటర్ల, కాకినాడకు 130 కిలోమీటర్ల, విశాఖ 272 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయుగుండంగా తుఫాన్ బలహీనపడనుంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి.. ఏపీ తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read more