AP: దక్షిణ కోస్తాకు వర్ష సూచన

ABN , First Publish Date - 2021-11-26T13:47:19+05:30 IST

దక్షిణ శ్రీలంక పరిసరాలకు ఆనుకుని నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

AP: దక్షిణ కోస్తాకు వర్ష సూచన

అమరావతి: దక్షిణ శ్రీలంక పరిసరాలకు ఆనుకుని నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమలపై బలమైన తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో  శుక్ర,  శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 29న అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల పాటు పశ్చిమ వాయవ్యంగా పయనిస్తుందని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2021-11-26T13:47:19+05:30 IST