వర్షాకాలం మరింత అప్రమత్తం!

ABN , First Publish Date - 2020-06-16T17:57:28+05:30 IST

వానలు మొదలయ్యాయి. ఇలాంటి చల్లని వాతావరణం వ్యాధికారక సూక్ష్మక్రిములకు ఎంతో అనుకూలం. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన ప్రస్తుత

వర్షాకాలం మరింత అప్రమత్తం!

ఆంధ్రజ్యోతి(16-06-2020)

వానలు మొదలయ్యాయి. ఇలాంటి చల్లని వాతావరణం వ్యాధికారక సూక్ష్మక్రిములకు ఎంతో అనుకూలం. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన ప్రస్తుత సమయంలో ఎటువంటి ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.


క్రిముల ద్వారా వ్యాధులు సోకకుండా...

వర్షాకాలం ఈగలు, దోమల బాధలు ఎక్కువ. కాబట్టి ఇవి దరి చేరే వీలు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం...


చేతులు పూర్తిగా కప్పేలా ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులు వేసుకోవాలి.


ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి.


ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా....

చల్లదనం, తేమ పలురకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి....


శరీరం తడి లేకుండా పొడిగా ఉంచుకోవాలి.


గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానానికి యాంటీ ఫంగల్‌ సబ్బులు వాడాలి. ఇదే కోవకు చెందిన క్రీములు, పౌడర్లు వాడుకోవచ్చు.


నీటి ద్వారా వ్యాధులు వ్యాపించకుండా..

వంటకూ, భోజనానికీ ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.


వంటకు ముందు కూరగాయలను ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


కాచి, చల్లార్చి, వడగట్టిన నీళ్లు తాగాలి.

Updated Date - 2020-06-16T17:57:28+05:30 IST