రెయిన్‌కోట్స్‌తో డ్యూటీ

ABN , First Publish Date - 2020-04-01T06:11:27+05:30 IST

సరైన రక్షణలు, సదుపాయాలు లేకుండానే కరోనా వైర్‌సపై భారతీయ డాక్టర్లు పోరాడుతున్నారు. రెయిన్‌ కోట్లు, మోటారు బైక్‌ హెల్మెట్లను ఉపయోగించుకుని రంగంలోకి దిగుతున్నారు.

రెయిన్‌కోట్స్‌తో డ్యూటీ

భారతీయ డాక్టర్ల దుస్థితి


న్యూఢిల్లీ, మార్చి 31: సరైన రక్షణలు, సదుపాయాలు లేకుండానే కరోనా వైర్‌సపై భారతీయ డాక్టర్లు పోరాడుతున్నారు. రెయిన్‌ కోట్లు, మోటారు బైక్‌ హెల్మెట్లను ఉపయోగించుకుని రంగంలోకి దిగుతున్నారు. మొత్తమ్మీద ఇది భారత దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థలోని దుస్థితికి అద్దంపడుతోంది. చైనా, దక్షిణ కొరియా నుంచి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను కొనుగోలు చేసేందుకు తాము యత్నిస్తున్నట్టు భారత ప్రధాని మోదీ తెలిపారు జనసమర్థం ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో 4700 మంది అంబులెన్స్‌ డ్రైవర్లు సరైన రక్షణ పరికరాల కోసం డిమాండ్‌ చేస్తూ మంగళవారం సమ్మె చేశారు. తమ జీవితాలను ఫణంగా పెట్టే ప్రసక్తి లేదని సదరు అసోసియేషన్‌ అధ్యక్షుడు హనుమాన్‌ పాండే స్పష్టం చేశారు. మనదేశంలో మే  నెల మధ్య నాటికి కనీసం లక్ష మంది వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకుతుందని ఒక అంచనా. కోల్‌కతాలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్లు రెయిన్‌ కోట్లను ధరించి పని చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మోటార్‌ బైక్‌ హెల్మెట్లను రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నామని హర్యానా ఉత్తర ప్రాంతంలోని ఒక ఈ్‌సఐ ఆసుపత్రి డాక్టర్‌ వెల్లడించారు. సరైన మాస్కుల సరఫరా లేకపోవడంతో అక్కడి డాక్టర్లు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రపంచంలో అతి తక్కువగా అంటే జిడిపిలో కేవలం 1.3 శాతం మొత్తాన్ని ప్రజారోగ్యం కోసం భారత్‌ ఖర్చు చేస్తోంది.  మాస్కులు తదితర కనీస రక్షణ పరికరాల కోసం డాక్టర్లే ఒకొక్కరు రూ. వెయ్యితో అనధికార ఫండ్‌ను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. సరైన రక్షణ లేకుండా పని చేయాలని ఎవరూ అనుకోరు కదా అని మరో డాక్టర్‌ వ్యాఖ్యానించారు. ప్రార్థనలు మినహా తమను భారత ఆరోగ్య వ్యవస్థ రక్షించే పరిస్థితి లేదని భారత ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించడం ఈ సందర్భంలో గమనార్హం.

Updated Date - 2020-04-01T06:11:27+05:30 IST