అరచేతిలో ఇంద్రధనుస్సు!

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

వర్షం కురుస్తున్న సమయంలో ఎండ వస్తే ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడటం చూసే ఉంటారు. ఆ ఇంద్రధనుస్సును అరచేతిలో ఏర్పడేలా చేయవచ్చు. ఎలా అంటారా? ముందుగా ఒక తెల్ల కాగితం తీసుకోండి. బొమ్మలో చూపించిన విధంగా దానికి గుండ్రంగా చిన్న రంధ్రం చేయండి...

అరచేతిలో ఇంద్రధనుస్సు!

వర్షం కురుస్తున్న సమయంలో ఎండ వస్తే ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడటం చూసే ఉంటారు. ఆ ఇంద్రధనుస్సును అరచేతిలో ఏర్పడేలా చేయవచ్చు. ఎలా అంటారా? ముందుగా ఒక తెల్ల కాగితం తీసుకోండి. బొమ్మలో చూపించిన విధంగా దానికి గుండ్రంగా చిన్న రంధ్రం చేయండి. నల్లకాగితం అతికించిన కిటికీ దగ్గర దాన్ని ఉంచండి. ఇప్పుడు సీసాను నీటితో నింపి తెల్లకాగితం ముందు ఉంచండి. దానిపై సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. రంధ్రంలోంచి వచ్చిన సూర్యకిరణాలు గాజు సీసాకి తగిలి తెల్లకాగితం మీద ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆకాశంలో కనిపించినట్టుగా కాకుండా, పూర్తి గుండ్రంగా ఉన్న ఇంద్రధనుస్సును మీరు చూస్తారు.

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST