తెలంగాణ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ ప్రకటించిన సాయం ఇది..

ABN , First Publish Date - 2020-04-11T01:23:55+05:30 IST

కరోనాపై జరుగుతున్న పోరులో భాగంగా రెయిన్‌బో హాస్పిటల్ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటును అందించాలని నిర్ణయించుకుంది.

తెలంగాణ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ ప్రకటించిన సాయం ఇది..

హైదరాబాద్: కరోనాపై జరుగుతున్న పోరులో భాగంగా రెయిన్‌బో హాస్పిటల్ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటును అందించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా.. కరోనా కట్టడికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రెయిన్‌బో హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేసింది. వైద్య పరికరాలకు సంబంధించిన పత్రాలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ, డాక్టర్ రమేష్ కంచర్ల అందజేశారు. ఐదు వేల పీపీఈ కిట్లు, పది వేల ఎన్-95 మాస్క్‌లు, 2 లక్షల 3-ప్లై మాస్క్‌లను రెయిన్‌బో హాస్పిటల్స్ అందజేసినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో తెలిపారు. కరోనాపై పోరుకు సాయం చేసిన రెయిన్‌బో హాస్పిటల్స్ యాజమాన్యానికి, సీఎండీ, డాక్టర్ రమేష్ కంచర్లకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


మరో వైపు కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-04-11T01:23:55+05:30 IST