ఉరుములు, మెరుపులతో వర్షం

ABN , First Publish Date - 2021-05-17T06:17:11+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో ఆదివారం అకాల వర్షం కురిసింది.

ఉరుములు, మెరుపులతో వర్షం
యాదాద్రిలో మోస్తారు వర్షం

 పేటలో పిడుగు పాటుతో ఇద్దరి మృతి
 మరో ఇద్దరి పరిస్థితి విషమం
 యాదాద్రి, నల్లగొండలో మోస్తరు వర్షం
సూర్యాపేటటౌన్‌ / యాదాద్రి, ఆంధ్రజ్యోతి / దేవరకొండ / శాలిగౌరారం / కేతేపల్లి, మే 16 :
ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో ఆదివారం అకాల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా లో కురిసి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిం ది. పిడుగుపాటుకు గురై ఇద్దరు కూలీలు మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాదాద్రి, నల్లగొండలో మోస్తారు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన భిక్షం(70), కారింగుల ఉమ(36) మిరప తోట ఏరుతుండగా ఉరుము లు, మోరుపులతో కూడి న వర్షం వచ్చింది. దీంతో వారంతా పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లారు. పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడడంతో భిక్షం, ఉమ అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు అక్కడే ఉన్న బయ్య లింగమ్మ, బయ్య సిద్దు, పేర్ల నీలమ్మ, ఉప్పుల నాగమ్మకు తీవ్రగాయాలు కావడంతో వారిని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం మిడ్తనపల్లి గ్రామానికి చెందిన బయ్య రామక్క, లక్ష్మి అత్తాకోడళ్ళు పిడుగుపాటుకు గురై తీవ్రగాయాలపాలయ్యా రు. అదేవిధంగా పెన్‌పహాడ్‌ మండలంలో ఈదురుగాలుల తో కురిసిన వర్షానికి విద్యుత్‌ స్థంభాలు విరిగి పడగా మేత కు వెళ్లిన ఐదు పశువులకు విద్యుత్‌ షాక్‌ తగిలి మృతిచెందాయి. జిల్లాలోని పెన్‌పహాడ్‌ మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు పూర్తి కాకపోవడం తో కురిసిన వర్షానికి ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.  
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివా రం మోస్తరు వర్షం కురిసింది. మేఘాలు కుమ్ముకుని కురుస్తున్న వర్షాలతో కోతలకు సిద్ధ ంగా ఉన్న వరి పైర్లతో పా టు కల్లాల్లో ధాన్యం కుప్పలు అక్కడక్కడ తడిసిపోయాయి. ఉదయం నుంచే మబ్బులు కమ్ముకున్న కారణంగా రైతులు టార్పాలిన్లు కప్పి నష్టం జరగకుండా చూసుకున్నారు. జిల్లాలోని వలిగొండ, భువనగిరి, మోత్కూరు, తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యం రాశుల కిందకి వరద నీరు చేరింది. తుఫాన ప్రభావంతో మేఘాలు కమ్ముకుంటుండటం, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి వర్షానికి తడవడం తో బస్తాల్లోనే ధాన్యం మొకెత్తింది. తుఫాన ప్రభావంతో భా రీ వర్షాలు కురిస్తే నష్టం వాటిల్లితుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 దేవరకొండలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండవేడిమికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజ లు వర్షం కురవడంతో కొంత  ఊరట చెందారు. శాలిగౌరా రం మండలం భైరవునిబండ గ్రామానికి చెందిన మిరుదొ డ్డి నరే్‌షకు చెందిన ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందింది. మేతకువెళ్లిన ఆవు ట్రాన్స్‌ఫార్మర్‌ వ్దద తెగిపడి ఉన్న కరెంటుతీగ తగిలి  విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినది. అకాల వర్షంతో కేతేపల్లి మండలం లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్‌
పెనపహాడ్‌ : మండలంలోని సింగారెడ్డి పా లెం,భక్తాళాపురం, ధర్మాపురం, పెనపహాడ్‌ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను తహసీల్దార్‌ శేషగిరిరావు సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించారు. ఆకాల వర్షా నికి తడసిపోయిన ధాన్యం పరిశీలించిన అనంతరం రైతులతో  మాట్లాడారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా తడసిన ధాన్యం కొనుగోలు చే స్తామని హామీనిచ్చారు. దిగుమతలు సరిగా కావట్లేదని నిర్వాహకులు తహసీల్దార్‌కు తెలి పారు. మిల్లర్లతో మాట్లాడి సమస్య పరిష్కారా నికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ మట్టయ్య, ఐకేపీ ఎంపీఎం రాంబాబు ఉన్నారు.



Updated Date - 2021-05-17T06:17:11+05:30 IST