కాస్త వర్షానికే ఇలా....!

ABN , First Publish Date - 2021-07-19T05:15:29+05:30 IST

వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని, దీనిపై అనేక దఫాలు అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాస్త వర్షానికే ఇలా....!
రహదారి పై నిలిచిన నీళ్లు

ఇది ధనలక్ష్మీపురంలోని నెల్లూరు - ముత్తుకూరు రహదారి. ఇటీవల కురిసిన కాస్త వర్షానికే ఇలా మడుగులా మారింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని, దీనిపై అనేక దఫాలు అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- నెల్లూరు రూరల్‌


నగరంలోని ఖుద్దూస్‌ నగర్‌లో రోడ్డు దుస్థితి ఇది. అసలే అడుగుకో గోతితో అధ్వానంగా ఉన్న రహదారి తేలికపాటి వర్షాలకు మరింత దుర్భరంగా మారింది. గోతుల్లో నీరు నిలవడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, పాదచారుల కు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొందరు గోతుల్లో అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.

- ఫొటో : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Updated Date - 2021-07-19T05:15:29+05:30 IST