హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వర్షం పడింది. భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిపోయాయి. వర్షానికి భక్తులు అవస్ధ పడ్డారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నుంచి నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నారు. కాసేపట్లో పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం చేస్తారు. సాగర తీరానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోన్న అధికారులు.. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పలు విభాగాల ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని కంట్రోల్ రూమ్‌ల నుంచి పర్యవేక్షించనున్నారు. శనివారమూ వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం చేశారు.