వదలని వర్షం..

ABN , First Publish Date - 2022-08-10T06:39:27+05:30 IST

అల్ప పీడన ప్రభావంతో ఏర్పడిన ముసురు ఇంకా వీడలేదు. గత రెండు రోజులుగా కాకినాడ నగరంలో దఫదఫాలుగా వాన పడుతూనే ఉంది.

వదలని వర్షం..
కాకినాడ నగరంలో మంగళవారం వర్షం కురుస్తున్న దృశ్యం

భానుగుడి(కాకినాడ)/ కాకినాడ సిటీ, ఆగస్టు 9: అల్ప పీడన ప్రభావంతో ఏర్పడిన ముసురు ఇంకా వీడలేదు. గత రెండు రోజులుగా కాకినాడ నగరంలో దఫదఫాలుగా వాన పడుతూనే ఉంది. ఈదురుగాలులు, వదలని వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వాతావరణం పూర్తిగా మబ్బుతో ఉండడం, ఆకస్మికంగా జోరున వానలు పడుతుండడంతో సాధారణ జీవనానికి విఘాతంగా మారుతోంది. అలాగే ఎడతెరపి లేని వర్షాల వల్ల పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వ్యాధుల సీజన్‌ కూడా కావడంతో ఈ వర్షాలకు చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ఇక జిల్లాలో గడచిన 24 గంటల్లో 9.8 మి.మీ.  సరాసరితో మొత్తం 205 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాళ్లరేవు మండలంలో 35.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పిఠాపురం మండలంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు చూస్తే.. (మి.మీ.లలో..)           క రప 23.6, కోటనందూరు 20.8, కాజులూరు 20.6, పెదపూడి 15.6, కాకినాడ అర్బన్‌ 13.4, కిర్లంపూడి 10.2, కాకినాడ రూరల్‌ 9.0, పెద్దాపురం 8.2, తొండంగి 7.4, జగ్గంపేట 7.2, తుని 5.6, ఏలేశ్వరం 5.2, శంఖవరం 4.6, ప్రత్తిపాడు 4.0, యు కొత్తపల్లి 3.2, సామర్లకోట 3.0, గొల్లప్రోలు 1.6, గండేపల్లి 1.4 మి.మీ. వర్షం కురిసింది. కాగా మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉంది.



Updated Date - 2022-08-10T06:39:27+05:30 IST