Heavy Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-29T22:01:49+05:30 IST

మహానగరాన్ని వర్షం (Rain) వీడడం లేదు. మళ్లీ దంచికొడుతుండడంతో గ్రేటర్ వాసులు విలవిల్లాడుతున్నారు.

Heavy Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: మహానగరాన్ని వర్షం (Rain) వీడడం లేదు. మళ్లీ దంచికొడుతుండడంతో గ్రేటర్ వాసులు విలవిల్లాడుతున్నారు. ఎల్బీనగర్ (LB Nagar), దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కనిపించింది. ఆ తర్వాత 4 గంటల నుంచి భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉద్యోగులు ఇంటికి వెళ్తున సమయంలో వర్షం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు. 

Updated Date - 2022-07-29T22:01:49+05:30 IST