అలంపూర్: అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని కలిగించింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలుచోట్ల బుధవారం రాత్రి నుంచి మొదలైన వాన గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. అలంపూర్, ఉండవెల్లి మండలాల పరిధిలో కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నేలకొరిగాయి. అలంపూర్ మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో కొంత ఆలస్యంగా వేసిన మొక్కజొన్న, మినప, పొగాకు, పత్తి పంటలు అకాల వర్షాలతో నష్టపోయాయి. చేతికి వచ్చిన ఎర్ర మిరప కల్లాలలో ఆరబెట్టుకోగా తడిసిపోయింది. కొంత మంది రైతులు ఎర్ర మిర్చిపై టార్పాలిన్లు వేసి కాపాడుకున్నా అధిక వర్షం నమోదు కావటంతో కల్లంలో పారిన నీళ్లు మిర్చిని తడిసి ముద్ద చేసింది. అలంపూర్ మండల పరిధిలో 43.6 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.
ఇవి కూడా చదవండి