Abn logo
Sep 27 2021 @ 00:44AM

వాన కురిస్తే విద్యార్థులకు నరకమే!

బురదలో నడిచి వస్తున్న కృష్ణాదేవిపేట జూనియర్‌ కళాశాల విద్యార్థులు

 చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్‌, ఎంపీపీ పాఠశాలలు, కృష్ణాదేవిపేట కళాశాల ఆవరణ బురదమయం  

 విద్యార్థులు అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి 

 ఏటా ఇదే సమస్య ఉన్నా స్పందించని  అధికారులు

నర్సీపట్నం అర్బన్‌/ కృష్ణాదేవి పేట, సెప్టెంబరు 26 : వివిధ పథ కాల నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చేస్తున్నట్టు అధికా రులు, ప్రజాప్రతినిధులు పదేపదే చెపు తున్నా పలుచోట్ల ఆయా ఆవరణతో పాటు మైదానాల విషయంలో మాత్రం దృష్టిసారించ లేకపోతున్నారు. ఫలితం గా చిన్నపాటి వర్షానికి సైతం అవి బుర దమయంగా మారుతున్నాయి. ఫలి తంగా విద్యార్థులు,  ఉపాఽధ్యా యులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థి తులు నెలకొంటున్నాయి.

 నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్‌, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు ఇందుకు ఉదాహ రణగా చెప్పవచ్చు.  జడ్పీ హైస్కూల్‌లో 251 మంది, ఎంపీపీ పాఠశాలలో 230 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏమాత్రం వర్షం పడినా ఆయా పాఠశాలల ఆవరణలు చిత్తడిగా మారు తున్నాయి. దీంతో విద్యా ర్థులు పాఠశా లల్లోకి వెళ్లాలంటే  ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. ఏమాత్రం అజా గ్రత్తగా ఉన్నా ఆ బురదలో జారి  గాయాలకు గురికావడం తథ్యం. ఇదిలావుంటే,  గొలు గొండ మండలం కృష్ణాదేవిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ, రోడ్డు నుంచి కళాశాలకు ఉన్న రహదారి సైతం ఇదే మాదిరిగా ఉంటున్నాయి. ఏటా వర్షా కాలంలో విద్యార్థులు ఈ సమ స్యను ఎదుర్కొంటున్నా కన్నెత్తి చూసే వారు కరువయ్యారు. ఇక్కడ గొలుగొండ, కొయ్యూరు మండలాలకు చెందిన 300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. మెయిన్‌ రోడ్డును ఆనుకుని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాశాల ఉంది. వర్షాలు కురిసినప్పుడు క్రీడా మైదానంలో భారీగా నీరు నిలిచిపో తోంది. దీంతో బురదగా మారుతుండ డంతో తర గతి గదుల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్ష ణమే దృష్టిసారించాలని ఇటు విద్యా ర్థులు, అటు ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది కోరుతున్నారు.