‘తొలకరి’ పలకరింపు..!

ABN , First Publish Date - 2020-06-03T10:43:37+05:30 IST

కరువు జిల్లాను తొలకరి వానలు పలకరించాయి. ఈనెలారంభం నుంచి ఖరీ ఫ్‌ సీజన్‌ మొ దలైంది.

‘తొలకరి’ పలకరింపు..!

పలు మండలాల్లో పదును వర్షం 


అనంతపురం వ్యవసాయం, జూన్‌ 2: కరువు జిల్లాను తొలకరి వానలు పలకరించాయి. ఈనెలారంభం నుంచి ఖరీ ఫ్‌ సీజన్‌ మొ దలైంది. సీజన్‌కు ముందు అక్కడక్కడా పడిన వర్షాల కు దుక్కులు చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మరోమారు పదును వర్షం పడటంతో విత్తనం వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొలాల్లో దుక్కులు చేసుకున్న తర్వాత పదును వర్షం పడితే విత్తనం వేస్తూ వస్తున్నారు. దుక్కు లు పూర్తి కాని పొలా ల్లో తాజాగా కురిసిన వర్షానికి దుక్కులు దున్నే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 57 మండలాల్లో  సోమవారం రాత్రి ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుందుర్పిలో 60 మి.మీ. వర్షపాతం నమోదైంది.


అలాగే గుంతకల్లు 24.2, పెద్దపప్పూరు 26.8, శింగనమల 29.6, కూడేరు 25,  బెళుగుప్ప 30.2, కణేకల్లు 26, శెట్టూరు 30.6, కళ్యాణదుర్గం 55.2, కంబదూరు 37.4, రామగిరి 29, సీకేపల్లి 53.2, ధర్మవరం 23.2, నల్లమాడ 21.2, పెనుకొండ 46.4, రొద్దం 27, సోమందేపల్లి 48.6, గుడిబండ 20, అమరాపురం 21, గుత్తి 19.4, రొళ్ల 18.4, కదిరి 17.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 13.6 మి.మీ.లోపు వర్షం కురిసింది. ఈనెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా రెండు రోజుల్లో 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-06-03T10:43:37+05:30 IST