హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో వర్షం

ABN , First Publish Date - 2022-04-21T22:18:39+05:30 IST

హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం పడింది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం పడింది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మినగర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పగటిపూట వేసవి తీవ్రత దారుణంగా ఉంటుండగా... సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో... ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-04-21T22:18:39+05:30 IST