Hyderabadలో వర్షం

ABN , First Publish Date - 2022-07-05T01:52:24+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) పడింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్‌, నాగోల్

Hyderabadలో వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) పడింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్‌, నాగోల్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్‌, చంపాపేట, సంతోష్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట, కాప్రా, సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌‌లో వర్షం కురిసింది. రామంతాపూర్‌లో ఇప్పటివరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. అంబర్‌పేట్‌లో 2 సెం.మీ. వర్షపాతం నమోదయింది. వర్షానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌ స్తంభించింది. వర్షం దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. డీఆర్ఎఫ్ (DRF), విపత్తు సహాయ బృందాలను బల్దియా అలర్ట్ చేసింది. 


మరోవైపు జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం... ఆదివారం జార్ఖండ్‌ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలోకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయని.. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - 2022-07-05T01:52:24+05:30 IST