ఢిల్లీలో వర్షం.. విమాన సర్వీసులు రద్దు

ABN , First Publish Date - 2022-05-24T05:09:50+05:30 IST

ఢిల్లీలో వర్షం కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన

ఢిల్లీలో వర్షం.. విమాన సర్వీసులు రద్దు

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఇక్కట్లు 


శంషాబాద్‌ రూరల్‌, మే 23 : ఢిల్లీలో వర్షం కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు సోమవారం రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురుస్తుండడంతో వాతావరణం అనుకులించక విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్‌వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం రావాల్సిన 6ఈ2187 విమానాన్ని రద్దు చేశారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి విమాన సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2022-05-24T05:09:50+05:30 IST