కురిసిన వర్షం.. కల్లాల్లో తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-20T05:29:18+05:30 IST

కురిసిన వర్షం.. కల్లాల్లో తడిసిన ధాన్యం

కురిసిన వర్షం.. కల్లాల్లో తడిసిన ధాన్యం
మంబాపూర్‌ కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యం

  • అన్నదాతలు ఆగమాగం

పెద్దేముల్‌, మే 19: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్దేముల్‌ మండలం లో జోరుగా వరికోతలు సాగుతున్నాయి. ఇదే స మయంలో వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్ట పోతున్నారు. మండలంలో మూడు రోజులుగా అడపాదడపా వర్షం పడుతోంది. గురువారం మధ్యాహ్నం సైతం జోరు వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క ల్లాల వద్ద ఉన్న వడ్లు సైతం తడుస్తున్నాయి. మ ండల పరిధి మంబాపూర్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడిచింది. అయినా ఇప్పటివరకు అధికారులు కొనుగోళ్లు ప్రారంభించనేలేదు. రాశులకొద్దీ వడ్లకుప్పలు నిల్వ అవుతున్నా యి. ఎప్పుడు కాంటా వేస్తారా? అనుకుంటూ వా రం రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడిని మొలకెత్తుతుందన్న భ యంతో చినుకులు ఆగిపోయాక తిరిగి ధాన్యాన్ని ఆరబోయడం.. మళ్లీ వర్షం కురియగానే టార్పాలిన్లు కప్ప డం.. ఇలా రైతులకు విశ్రాంతి లేకుండా పోతోంది. కొన్నిచోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వచేసేందుకు వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. కనీసం షెడ్లనైనా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-20T05:29:18+05:30 IST