Telanganaకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన

ABN , First Publish Date - 2022-05-08T22:41:24+05:30 IST

తెలంగాణకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే

Telanganaకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, తుపానుగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని అధికారలు తెలిపారు. వచ్చే 6 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా, రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం ఏపీలోన విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,140 కి.మీ., పూరీ (ఒడిసా)కి దక్షిణ ఆగ్నేయంగా 1,180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా, సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్‌గా మారాక ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును శ్రీలంక సూచించింది. సింహళి భాషలో అసాని అంటే ‘కోపం’.

Read more