పాలమూరును ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-09-06T01:23:27+05:30 IST

వర్ష భీభత్సంతో పాలమూరు జలమయమైంది.. శనివారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభమైన కుండపోత వర్షం ఐదు గంటల పాటు దంచి కొట్టింది.

పాలమూరును ముంచెత్తిన వాన

మహబూబ్‌నగర్‌: వర్ష భీభత్సంతో పాలమూరు జలమయమైంది.. శనివారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభమైన కుండపోత వర్షం ఐదు గంటల పాటు దంచి కొట్టింది. చెరువులు అలుగులు పారాయి. వాగులు పొంగి పొరలాయి. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల ఇళ్ళల్లోకి అర్ధరాత్రి వరదనీరు చేరడంతో జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వరద ఉధృతి పెరగడంతో కోయిల్‌సాగర్‌ ఐదు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. మిడ్జిల్‌ మండలం దుందుభీ వాగులో యువకుడు గల్లంతయ్యాడు. జిల్లాలో పలు చెరువులు అలుగులు పారగా, వాగులు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. పాలమూరు పట్టణంలో 87, మూసాపేటలో 79, భూత్పూర్‌లో 72.5, హన్వాడలో 62.6,  మహమ్మదాబాద్‌లో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

Updated Date - 2021-09-06T01:23:27+05:30 IST