వాన.. వణుకు

ABN , First Publish Date - 2021-04-16T07:14:09+05:30 IST

వాతావరణంలో ఆకస్మిక మార్పులు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. మబ్బుతోపాటు వర్షాలు పడుతుండడంతో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఏలేరు, పీబీసీ ఆయకట్టులో ప్రస్తుతం దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

వాన.. వణుకు
ఎటపాక మండలం గన్నవరంలో నీటిలో తేలిన మిర్చి పంట

పిఠాపురం, ఏప్రిల్‌ 15: వాతావరణంలో ఆకస్మిక మార్పులు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. మబ్బుతోపాటు వర్షాలు పడుతుండడంతో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఏలేరు, పీబీసీ ఆయకట్టులో ప్రస్తుతం దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలేరు, సుద్దగడ్డ వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో సార్వా (మొదటి) పంటను కోల్పోయిన రైతులు దాళ్వా సాగుపైనే ఆశలు పెంచుకున్నారు. అక్కడక్కడ తెగుళ్లు ఆశించినా పంట ఆశాజనకంగానే ఉంది. దిగుబడు లు అధికంగా వస్తే నష్టాలు పూడ్చుకోవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఇప్పటికే 40శాతంపైగా విస్తీర్ణంలో కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయి. వాతావర ణం అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న మార్పులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళ, బుధవారాలతోపాటు గురువారం తెల్లవారుజామున ఆకాశంలో దట్టంగా మేఘాలు అలముకుని స్వల్ప వర్షం కురిసింది. అక్కడక్కడ వరిపనలు, ధాన్యం రాశులు కొంతమేర తడిచాయి. దీంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. హడావుడిగా వరికోత యంత్రాల సహాయంతో మాసూళ్లు నిర్వహిస్తున్నారు. పది రోజులు వాతావరణం అను కూలిస్తేనే ఒబ్బిడి చేసుకోగలుగుతామని రైతులు చెప్తున్నారు.

కల్లాల్లో మిర్చి నీళ్లపాలు

ఎటపాక, ఏప్రిల్‌ 15: ఎటపాక మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కోతలు చేపట్టి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీటిలో పంట కొట్టుకుపోయింది. ఈ మండ లంలోనే 100 క్వింటాళ్ల మిర్చి పంట తడిసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-04-16T07:14:09+05:30 IST