పొంచి ఉన్న జల ఖడ్గం!

ABN , First Publish Date - 2021-07-24T07:12:55+05:30 IST

మహాబలేశ్వరం.. కృష్ణా నది జన్మస్థానం! వరుణుడు ఇక్కడ రికార్డు సృష్టిస్తున్నాడు! 24 గంటల్లోనే ఇక్కడ 60 సెంటీమీటర్ల కుంభవృష్టి! గత రెండు రోజుల్లోనే ఏకంగా 108 సెంటీమీటర్ల వర్షపాతం! పశ్చిమ కనుమల్లో ఎక్కడ చూ

పొంచి ఉన్న జల ఖడ్గం!

మహాబలేశ్వరంలో 24 గంటల్లోనే 60 సెంటీమీటర్ల కుండపోత

ఎగువన భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

వచ్చిన వరద కంటే ఎక్కువగా దిగువకు నీటి విడుదల

ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేసిన కేంద్ర జల సంఘం

ఎస్సారెస్పీ పరిధిలో రెడ్‌ అలర్ట్‌ జారీ.. నిర్మల్‌ జిల్లాలో కూడా

ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌

తుంగభద్ర, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి

మహాబలేశ్వరం.. కృష్ణా నది జన్మస్థానం! వరుణుడు ఇక్కడ రికార్డు సృష్టిస్తున్నాడు! 24 గంటల్లోనే ఇక్కడ 60 సెంటీమీటర్ల కుంభవృష్టి! గత రెండు రోజుల్లోనే ఏకంగా 108 సెంటీమీటర్ల వర్షపాతం! పశ్చిమ కనుమల్లో ఎక్కడ చూసినా భారీ వర్షాలు! ఇందులో భాగమైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కుండపోత వానలు! ఫలితంగా.. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద! అంతేనా, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. దాంతో, ఆయా ప్రాజెక్టులకు వచ్చిన వరద కంటే అధికంగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు! ఈ ప్రవాహాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తే పరిస్థితి కనబడుతోంది. ఆకస్మిక వరదల హెచ్చరిక కారణంగానే, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నిర్మల్‌ జిల్లాను కూడా ఇందులో చేర్చారు. గురువారం కురిసిన కుండపోత వర్షానికి నిర్మల్‌ జిల్లా ఇప్పటికే చిగురుటాకులా వణుకుతోంది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వరదలు మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్నాయి. 

Updated Date - 2021-07-24T07:12:55+05:30 IST