పలుచోట్ల మోస్తరు వర్షం

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

పలుచోట్ల మోస్తరు వర్షం

పలుచోట్ల మోస్తరు వర్షం
ఘట్‌కేసర్‌లో కురుస్తున్న వర్షం

ఘట్‌కేసర్‌/వికారాబాద్‌, జూలై 3: మేడ్చల్‌, వికారాబాద్‌ జి ల్లాల్లో ఆదివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురసింది. మేడ్చ ల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సాయంత్రం వర్షం పడింది. శనివారం రాత్రి సైతం మండలంలో మోస్తరు వర్షం కురిసింది. వికారా బాద్‌లో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. సాగుపనులు చేస్తున్న రైతులు ఈ వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానలతో మొలకల్లో కలుపుతీత పనులు చేపట్టారు. మరికొందరు విత్తనాలు వేస్తున్నారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST