ఈనెల 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం

ABN , First Publish Date - 2020-06-07T13:52:56+05:30 IST

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.

ఈనెల 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో రెండు రోజుల్లో కోస్తాంధ్ర, సీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. తూర్పు విదర్భలో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం వెల్లడించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 

Updated Date - 2020-06-07T13:52:56+05:30 IST