Abn logo
Jul 22 2021 @ 22:00PM

సిద్దిపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు

సిద్దిపేట: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, ధూల్మిట మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు అలుగుపారుతున్నాయి.  చేర్యాల మండలంలోని తాడూర్ వాగు, కడవేర్గుచెరువు  నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు ఐదు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.