Abn logo
May 17 2021 @ 00:30AM

నీటి గుంతలతో వాహనదారుల ఇక్కట్లు

కేదారేశ్వరపేట(పాతరాజరాజేశ్వరి పేట), మే 16 : నగరంలో కురుస్తున్న వానలకు ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు కాస్త కుదుట పడుతున్నా కేదారేశ్వరపేట మసీదు సెంటర్‌లో మాత్రం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేదారేశ్వరపేట మసీదు సెంటర్‌లో రోడ్డుకు గుంతలు అధికంగా ఉండటంతో వర్షాలకు వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కాస్త వర్షం పడితేచాలు ఆ గుంతల్లో వర్షపు నీరు చేరి, వాహనదారులకు మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. దూరం నుంచి నీటి గుంతలు కనబడక వాహనదారులు గుంతల బారిన పడుతున్నారు. తరచు వాహనాలు అదుపు తప్పి చిన్నపాటి ప్రమాదాలు తరచు జరుగుతూనే ఉంటున్నాయి. సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ రోడ్డులో దాదాపుగా ఆ సమస్య నెలకొని ఉంది. నెలల తరబడి ఉన్న ఈ సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదని వాహనదారులు, స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేసి తమకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement