రైల్వే శ్రామిక్ రైళ్లు పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతోంది...

ABN , First Publish Date - 2020-05-30T12:16:34+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి కేంద్రంపై మరో సారి విరుచుకుపడ్డారు....

రైల్వే శ్రామిక్ రైళ్లు పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతోంది...

కేంద్రంపై మమతాబెనర్జీ ధ్వజం

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి కేంద్రంపై మరో సారి విరుచుకుపడ్డారు. రైల్వేశాఖ శ్రామిక్ స్పెషల్స్ పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతుందని సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వలసకార్మికుల మధ్య భౌతిక దూరం పాటించడం లేదని సీఎం విమర్శించారు. చట్టం అందరికీ సమానమేనని, కాని రైల్వేశాఖ శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ప్రయాణించే వలసకార్మికులకు ఆహారం, మంచినీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని, సామాజిక దూరం ఎందుకు పాటించడం లేదని సీఎం ప్రశ్నించారు. రైల్వేశాఖ శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌ల పేరిట కరోనా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతోందని, కరోనా హాట్‌స్పాట్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకు వస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రైవేటు రంగంలో కార్మికులందరూ సురక్షితంగా ఉండి పనిచేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని జూట్ మిల్లులు, టీ గార్డెన్ లు వందశాతం కార్మికులతో పనిచేస్తాయని సీఎం చెప్పారు. పశ్చిమబెంగాల్ లోని దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు, చర్చ్ లు మూసి ఉంచుతామని సీఎం మమతాబెనర్జీ  వివరించారు.

Updated Date - 2020-05-30T12:16:34+05:30 IST